దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా బోనాలు..

– పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైన బోనాల పండుగను సీఎం కేసీఆర్ ఆదేశాలతో దేవాదాయ శాఖ బోనాల పండుగను ఎంతో ఘనంగా నిర్వహించిందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. టీఎన్జీవో ఎండోమెంట్ యూనిట్ అధ్యక్షులు బాబు శంకర్ ఆధ్వర్యంలో మంగళవారం బొగ్గులకుంట లోని దేవాదాయ శాఖ కమిషనరేట్ లోని బంగారం మైసమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ఉద్యోగులూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఉద్యోగులు అమ్మవారికి డీజే హోరులో తొట్టెలను సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి సాంప్రదాయ బద్దంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ కు ప్రభుత్వం 15 కోట్లతో  రెండువేల ఐదు వందలదేవాలయాలకు అన్ని సౌకర్యాలు కల్పించి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకునేందుకు చెక్కుల రూపంలో అందించారన్నారు. అమ్మవారికి వర్షాలు పడాలని మొక్కుకోవడంతో ఈ ఏడు సమృద్ధిగా వర్షాలు పడ్డాయి అన్నారు అమ్మవారి కృపా కటాక్షంతో తెలంగాణ రాష్ట్రం నిండుకుండలా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాశాఖ కమిషనర్ అనిల్ కుమార్. నిజాంబాద్ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి. అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి. జ్యోతి కురాకుల. టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రాజేందర్. జగదీష్. ఎండోమెంట్ యూనిట్ అధ్యక్షుడు బాబు శంకర్ .నరేష్. వినోద్ రెడ్డి. కార్తీక్ యాదవ్. సత్యనారాయణ. కృష్ణమాచారి. ఆర్ వి మహేందర్ కుమార్. ఉద్యోగులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.