భూపతిరెడ్డి సమక్షంలో 300 మంది గంగా పుత్రులు చేరిక

నవతెలంగాణ- మోపాల్: మంగళవారం రోజున రూరల్ నియోజకవర్గానికి చెందిన దాదాపు 300 మంది, గంగపుత్రులు సంఘం అధ్యక్షుడు బోర్గం శ్రీనివాస్ ఆధ్వర్యంలో భూపతి రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా ఎటువంటి లాభావేక్ష లేకుండా కేవలం భూపతిరెడ్డి గెలుపు కొరకే మేం పని చేస్తామని కచ్చితంగా రూరల్ నియోజకవర్గంలో మా గంగపుత్రులందరం కలిసి భూపతిరెడ్డికి మద్దతు తెలుపుతున్నామని బీఆర్‌ఎస్‌ పాలనలో మేము చాలా నష్టపోయామని, ఈసారి రూరల్ నియోజకవర్గం లో భూపతిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలుపొందడానికి సాయిశక్తుల కష్టపడి పని చేస్తామని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గంగపుత్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని నమ్మే మోసపోయామని ఇప్పటివరకు మమ్మల్ని ఆదుకోలేదని మొత్తం కబ్జాలకే పరిమితమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.