– కొనసాగుతున్న ఏకగ్రీవ తీర్మానాలు
నవతెలంగాణ- కమ్మర్ పల్లి: బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు, యువకులు, ఇతర పార్టీ కార్యకర్తలు బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామం నుండి టీపీసీసీ డెలిగేట్, మాజీ సొసైటీ చైర్మన్ క్యాతం గంగారెడ్డి, మాజీ నీటి సంఘం చైర్మన్ గడ్డం ముత్యం రెడ్డి, సీనియర్ నాయకులు ఎర్రోళ్ల చిన్నారెడ్డి, రిక్కల రవి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.వెంచిర్యాల్ గ్రామం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎన్ ఎస్ యుఐ ప్రెసిడెంట్ పాశపు నర్సారెడ్డి, వార్డు సభ్యుడు సామ శ్రీనివాస్, గడ్డం రాజేశ్వర్, కార్యకర్తలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.మెండోరా మండలం సొన్ పెట్ గ్రామానికి చెందిన క్రేజీ బాయ్స్, ఫ్రీడమ్, యూనీటి యూత్ యువజన సంఘాల సభ్యులు, ఆదివాసీ నాయకపోడు సంఘ సభ్యులు, వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజారపు మురళి, కార్యకర్తలు పార్టీలో చేరారు. మోర్తాడ్ మండలం గాండ్లపెట్ గ్రామానికి చెందిన నూతనంగా ఓటు హక్కు పొందిన యువకులు మంత్రి ప్రశాంత్ రెడ్డి కి మద్దతు తెలుపుతూ పార్టీలో చేరారు. ముప్కల్ మండలం వెంపల్లి గ్రామానికి చెందిన వొళ్ళేం గుల మల్లేష్, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుండి తిరిగి సొంత గూటికి చేరారు. గ్రామానికి చెందిన విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు పార్టీలో చేరారు. వీరందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు.
మంత్రి వేములకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు…
బాల్కొండ నియోజకవర్గ నలుమూలల అన్ని గ్రామాల నుండి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోంది. పలు కుల సంఘాలు, యువజన సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం వెంపల్లి గ్రామానికి చెందిన విశ్వ బ్రాహ్మణ సంఘం, మోర్తాడ్ మండలం షెట్పల్లి గ్రామానికి చెందిన యశోదా కృష్ణ గొర్రెల పెంపకం దారుల సంఘం ఏకగ్రీవ తీర్మానము చేశారు. అభివృద్ది ప్రదాత వేముల ప్రశాంత్ రెడ్డికే మా ఓటు అంటూ ముక్త కంఠంతో నినదించారు. అందుకు సంబంధించిన తీర్మాన పత్రాలు మంత్రికి అందజేశారు. తనకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల మంత్రి వేముల హర్షం వెలిబుచ్చారు. వారి అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.