నవతెలంగాణ-ఆర్మూర్ : పట్టణములో హౌసింగ్ బోర్డ్ కాలనీ లో జిల్లా దేవంగా సంఘం యొక్క ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బి.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం 5 కోట్ల విలువ చేసే స్థలాన్ని ,నిర్మాణం కోసం 80 లక్షల నిధులై మంజూరు చేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు పండిత్ ప్రేమ్ ,రిటైర్డ్ కలెక్టర్ చిరంజీవులు, రిటైర్డ్ సి టి ఓ గుత్ప రాజేశ్వర్, జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు దుగ్గి లక్ష్మణ్ ,ప్రధాన కార్యదర్శి నారాయణ, ఉపాధ్యక్షులు గు పాల భూపేందర్, రాస గగ్గుపల్లి శ్యామ్, సంయుక్త కార్యదర్శి భూ మే ని రాజేశ్వర్, కామ నీ నరేష్ ,,మాజీ సర్పంచ్ కొంగి సదాశివ్ తదితరులు పాల్గొన్నారు.