వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..

– సద్వినియోగం చేసుకోవాలని పిలుపు..సిఈఓ తేజాగౌడ్..
నవతెలంగాణ- డిచ్ పల్లి:
వరి కోనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సిఈఓ తేజాగౌడ్ అన్నారు.శనివారం ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో నల్లవెల్లి సహకార సొసైటీ అధ్వర్యంలో నేలకోల్పిన వరి కోనుగోలు కేంద్రాన్ని సోసైటి సిఈఓ తేజాగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మధ్యదళారులను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. ధన్యానికి మాత్రం  అదికారుల సూచనల మేరకు మ్యచర్  వచ్చిన తర్వాతనె సీరియల్ మేర వరి ధాన్యం కంట వేయడం జరుగుతుందని, దానికి రైతులు సహకరించాలని సిఈఓ తేజాగౌడ్ కోరారు.ఈ కార్యక్రమం లో ఏఈఓ శ్రీహరి, కోశాధికారి పిప్పెరా రాజన్న, ఆపరేటర్ శ్రావణ్, సొసైటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.