
– పెద్దవాగు ప్రాజెక్టు కు వరద..
– ఒక గేటు తో అదనపు నీరు విడుదల..
– ప్రాజెక్టును పరిశీలించిన ఉన్నతాధికారులు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
గత మూడు రోజులగా ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి.దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అశ్వారావుపేట – వాగొడ్డుగూడెం మద్య వంతెన పైకి వరద రావడంతో సర్పంచ్ జ్యోత్స్న బాయి రాకపోకలు నిలిపివేసే విధంగా చర్యలు చేపట్టారు.గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టు వరద ఉధృతి నెలకొంది.మండలంలో బుధవారం ఉదయానికి 70.6 మి.మీ,మధ్యాహ్నం 2 గంటలకు 8.5 మి.మీ మొత్తం 79.1 మి.మీ వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 81.235 మీటర్లు కాగా ఇప్పటికే 80.085 నీరు చేరింది. దీని స్థూల సామర్ధ్యం 557.079 ఎం.సీ.ఎఫ్.టి కాగా ప్రస్తుత సామర్ధ్యం 415.079 ఎం.సి.ఎఫ్.టి కాగా ప్రత్యక్ష సామర్ధ్యం 327.668 ఎం.సి.ఎఫ్.టి.దీంతో నీటిపారుదల శాఖ ఈ.ఈ సురేష్ బుధవారం ప్రాజెక్ట్ ను పరిశీలించారు.మూడు గేట్ల లో 3 నెంబర్ గెట్ 1 మీటర్ ఎత్తి అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు డి.ఈ.ఈ ఎల్.క్రిష్ణ తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎం.పి.పి శ్రీరామ మూర్తి,ఎ.ఈ కె.ఎన్.బి క్రిష్ణ,ఎస్.ఐ శ్రీకాంత్ ఇరు శాఖల సిబ్బంది ఉన్నారు.