నవతెలంగాణ -సుల్తాన్ బజార్
తెలంగాణ ప్రభుత్వం దివ్యాం గులకు ఇస్తున్న ఆసరా పింఛన్ పెంపు నిర్ణయం హర్షనీయమని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఉద్యమకారుడు ఆర్వీ మహేందర్‌కుమార్ అన్నారు. ఆదివారం కోఠిలోనీ బ్యాంక్ స్ట్రీట్ కార్యాలయంలో ఆయన మాట్లాడు తూ సీఎం కేసీఆర్ దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3116కు అదనంగా వెయ్యి రూపాయలు కలిపి మొత్తంగా రూ.4,116 ఆసరా పింఛన్ అందించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల దివ్యాంగులంతా ముక్త కంఠంతో స్వాగతిస్తున్నామన్నారు.