– సీఎం కేసీఆర్‌కు చాడ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ పర్యాటక కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగా వయోపరిమితిని 61 ఏండ్లకు పెంచాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు గురువారం ఆయన లేఖ రాశారు. పర్యాటక కార్పొరేషన్‌లో 25 ఏండ్లుగా చాలీచాలని వేతనాలతో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. చాలా మంది ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్నారని పేర్కొన్నారు. వారి కుటుంబాలు గడవడానికి చాలా ఇబ్బందులున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వారి వయో పరిమితిని 61 ఏండ్లకు పెంచాలని కోరారు.