స్వతంత్ర దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలలో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను మంగళవారం ఎగుర వేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. పోలీస్ స్టేషన్ లో ఎస్సై సుదీర్ రావు, ఎంపీడీఓ కార్యాలయంలో మండల ఎంపిపి మాస్త ప్రభాకర్, తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ శంకర్, వివిధ గ్రామాల్లో సర్పంచులు జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, యువకులు, చిన్నారులు, గ్రామ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.