చంద్రునిపై  అడుగుపెట్టిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది 

నవతెలంగాణ – వీర్నపల్లి 
రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం రంగం పేట, వీర్నపల్లి అంబేడ్కర్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం చంద్రయాన్ 3 పై విధ్యార్థులకు విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించి  రాకెట్ మోడల్ ను , విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ మోడల్స్  తయారుచేసి విద్యార్థులకు చంద్రయాన్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులే చంద్రయాన్ 3 గొప్పతనాన్ని గురించి, భారతదేశం చంద్రునిపై సౌత్ పోల్ లో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన దేశంగా చరిత్ర సృష్టించిందని విధ్యార్థులు మాట్లాడినారు.అనంతరం ప్రధానో పాధ్యాయులు ప్రవీణ్  ఈ ప్రదర్శన ద్వార  విద్యార్థుల్లో వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించ వచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వకుళ, ఉపాధ్యాయురాలు మానస వీణ, దివ్య, రాణి, విధ్యార్థులు ఉన్నారు.