వ్యవసాయ యాంత్రీకరణలో భారత్‌ వెనుకబాటు

మూడవ పంచవర్ష ప్రణాళికలో ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ రష్యా అనుసరించిన వ్యవసాయ విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు. సమిష్టి వ్యవసాయ క్షేత్రాల ద్వారా విశాలమైన భూభాగాలలో యంత్రాల ద్వారా వ్యవసాయం చేసి అధికోత్పత్తికి బాటలు వేశారు. కానీ అభివృద్ధి నిరోధకతత్వం కలిగిన కాంగ్రెస్‌లోని వర్గాలు నెహ్రూ విధానాన్ని వ్యతిరేకించాయి. భారతదేశాన్ని దిగుమతులకు కేంద్రంగా చేయాలని, ఉత్పత్తి, ఉత్పాదకతలను తగ్గించాలని, వ్యవసాయరంగానికి ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని, నాటినుండే పోరాటాలు మొద లైనాయి. తర్వాత ప్రధాని ఇందిరాగాంధీ, అభివృద్ధి వ్యతిరేక శక్తులను ఓడించి రాజీలేకుండా 1965 నుండి కొన సాగుతున్న హరిత విప్లవాన్ని 1985 వరకూ, తాను బతికున్నంతవరకూ కొనసాగించింది.
దేశంలో 2000సంవత్సరం నుండి వ్యవసాయ పరిశోధనలను 75శాతం తగ్గించారు. అదే సందర్భంలో యాంత్రీకరణ పరిశోధన కూడా 50శాతం తగ్గించారు. ఆర్థికంగా దేశాన్ని అభివృద్ధి పరిచేందుకు దోహద పడే యాంత్రీకరణ పరిశోధనను తగ్గించడం ఉత్పత్తి, ఉత్పాదకతలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ప్రస్తుత కాలమే కాక రానున్న కాలంలో ఎవరూ వ్యవసాయ పనులకు వచ్చే పరిస్థితి కనబడటంలేదు. అలాంటి పరిస్థితులలో దేశం స్వయంపోషకత్వం కావడానికి కావలసిన యంత్రాలను ఉత్పత్తి చేయాలి. మండల స్థాయిలో ”అద్దె, కొనుగోళ్ళు” పద్ధతిపై యంత్రాలను రైతులకు అందుబాటులో ఉంచాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా రైతులకు, ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులకు యంత్రాలను అందించే పని చేయాలి.
ప్రపంచ వ్యవసాయ రంగంలో 18వ శతాబ్దంలోనే యాంత్రీకరణ ప్రారంభమైనప్పటికీ భారతదేశంలో 20వ శతాబ్దంలో ప్రవేశపెట్టబడింది. ఇప్పటికీ వ్యవసాయ పనులలో 40శాతమే యాంత్రీకరణ ద్వారా పనులు జరుగుతున్నాయి. అమెరికాలో 95శాతం, బ్రెజిల్‌ 75, చైనా 57శాతం వ్యవసాయ యాంత్రీకరణతో ముందుపీటిన ఉన్నాయి. యాంత్రీకరణ ద్వారా పంటభూముల సాగు మెరుగువడమే కాకుండా క్రమపద్ధతిలో వ్యవసాయం జరుగుతుంది. ఉత్పాదకత పెరుగుతుంది. పర్యావరణ పరిస్థితులు ఏర్పడినప్పటికీ యంత్రాల ద్వారా వ్యవసాయం చేయవచ్చు. కానీ దేశంలో నేటికీ మాన్యువల్‌ పంపుసెట్ల వినియోగం, విద్యుత్తు బ్యాటరీ సహాయంతో స్ప్రేయర్లను వాడటం జరుగుతున్నది. గత ఐదేండ్ల నుండి పంట కోతలకు హార్వెస్టర్లను వినియోగిస్తున్నాం. ఇప్పటికీ వరినాటు, కలుపుకు యాంత్రీకరణ ప్రవేశపెట్టలేదు. గతంలో వరి పండించడానికి 52మంది కూలీలు అవసరం కాగా నేడు యాంత్రీకరణ ద్వారా ఆ సంఖ్య 25కి తగ్గింది. అభివృద్ధి చెందిన దేశాలలో కూలీల అవసరం లేకుండానే యంత్రాలతో పంటలు పండిస్తున్నారు. చైనాలో ‘సింగిల్‌ పికింగ్‌’ రకం పత్తిని వేసి ఒకేసారి యంత్రం ద్వారా పత్తిని ఏరడం, గింజలు తీయడం, దూదిని బండిల్స్‌గా తయారు చేయడం చేస్తున్నారు. వ్యవసాయంలో ఉపాధి తగ్గుతున్నది. రానురానూ వ్యవసాయ కార్మికులు కూడా ఈ రంగంలో పనిచేయడానికి సుముఖంగా లేరు. తెలంగాణలో 14.57 కోట్ల మంది రైతు కుటుంబాలు ఉండగా, అందులో 12.56కోట్ల మంది ఐదు ఎకరాలకు లోపువారే. వీరికి చిన్న యంత్రాల అవసరం ఉంది. భారతదేశంలో హరితవిప్లవ కాలంలో ట్రాక్టర్లు ప్రవేశపెట్టారు. అప్పుడు కొంతమంది వ్యతిరేకించారు. కానీ నేడు అందరూ యాంత్రీకరణను కోరుతున్నారు. మానవ శ్రమను ఇతర రంగాలకు తరలించడం, పట్టణాలకు వలసలు వెళ్ళడం, అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి వినియోగిస్తున్నారు. నిర్మాణ పనులు, రహదారులు, పారిశుధ్యం, గృహ పనులకు మానవ శ్రమను మల్లించారు. యాంత్రీకరణ వల్ల దారిద్య్ర రేటు కూడా తగ్గింది. తక్కువ ఆదాయంతో వ్యవసాయ రంగంపై ఆధారపడిన కూలీలు పట్టణాలకు వలస రావడంతో అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. పిల్లల చదువు, వైద్యానికి సౌకర్యం ఏర్పడింది. ‘నేషనల్‌ శాంపుల్‌ సర్వే 1998-2021’ నివేదిక ప్రకారం, 1951లో 100శాతం ఉన్న మానవ శ్రమ 25శాతానికి తగ్గినట్లు తేల్చారు. మహిళల పనిని తగ్గించారు. కానీ నేడు మహిళలే యాంత్రీకరణ ద్వారా వ్యవసాయ పనులు చేస్తున్నారు. పురుషులను పట్టణాలు, ఇతర దేశాలకు వలసలు పంపుతూ అదనపు ఆదాయం పొందేందుకు ఉపాధి అవకాశాలు వెతుక్కున్నారు. సేవా రంగంలో 50శాతం, పారిశ్రామిక రంగంలో 35శాతం మానవ శ్రమ నేటికీ కొనసాగుతున్నది.
రష్యా వ్యవసాయ విధానాన్ని అనుసరించిన నెహ్రూ
అమెరికాలో జీడీపీకి రెండుశాతం తోడ్పాటు ఇస్తున్న వ్యవసాయరంగంలో 1.2శాతం ప్రజలు మాత్రమే పాల్గొంటున్నారు. నేటికీ భారత్‌లో 52శాతం, మంది తక్కువ ఆదాయం వచ్చినప్పటికీ, మరో ఉపాధి అవకాశం లేక వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. ఉపాధి కల్పించడంలో భారత పాలక వర్గాలకు ఎలాంటి ప్రణాళిక లేదు. ప్రాప్తకాలజ్ఞతగా ఉపాధి కల్పిస్తున్నారు. పారిశ్రామిక రంగం నేటికి 32శాతం ఉత్పాదకతలో ఉండగా, సేవారంగం 54శాతం ఉత్పాదకతలో ఉంది. మూడవ పంచవర్ష ప్రణాళికలో ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ రష్యా అనుసరించిన వ్యవసాయ విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు. సమిష్టి వ్యవసాయ క్షేత్రాల ద్వారా విశాలమైన భూభాగాలలో యంత్రాల ద్వారా వ్యవసాయం చేసి అధికోత్పత్తికి బాటలు వేశారు. కానీ అభివృద్ధి నిరోధకతత్వం కలిగిన కాంగ్రెస్‌లోని వర్గాలు నెహ్రూ విధానాన్ని వ్యతిరేకించాయి. భారతదేశాన్ని దిగుమతులకు కేంద్రంగా చేయాలని, ఉత్పత్తి, ఉత్పాదకతలను తగ్గించాలని, వ్యవసాయరంగానికి ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని, నాటినుండే పోరాటాలు మొద లైనాయి. తర్వాత ప్రధాని ఇందిరాగాంధీ, అభివృద్ధి వ్యతిరేక శక్తులను ఓడించి రాజీలేకుండా 1965 నుండి కొన సాగుతున్న హరిత విప్లవాన్ని 1985 వరకూ, తాను బతికున్నంతవరకూ కొనసాగించింది. యేటా కోటి టన్నుల ఆహారధాన్యాల దిగుమతికి కేంద్రంగా ఉన్న దేశం, 1985లో రెండు కోట్ల ఆహారధాన్యాలు ఎగుమతి చేసే స్థితికి చేరుకుంది. దీంతో ప్రపంచంలోని అగ్రదేశాలు కూడా భారతదేశ వ్యవసాయ ఉత్పత్తిని తగ్గించడానికి పాలకవర్గాలపై ఒత్తిడి తెచ్చాయి. 1991 నుండి సరళీకృత విధానాల పేరుతో సాగిన సంస్కరణలు వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు ఆటంకంగా మారాయి. ఆవిధంగా ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గింది. సన్న, చిన్నకారు రైతులకు ఉపయోగపడే చిన్న యంత్రాలను ఉత్పత్తి చేయకుండా హార్వెస్టర్లు, ప్లౌస్‌ వంటి భారీ యంత్రాలతో పాటు కల్టివేటర్స్‌, భారీ ట్రాక్టర్లను మాత్రమే ఉత్పత్తి చేసారు. చిన్న యంత్రాల ఉత్పత్తిపై ఆంక్షలు కొనసాగడంతో ఉత్పత్తిని తగ్గించారు. 2022 నాటికి అన్ని దేశాలలో, వాటి స్థూల ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత విపరీతంగా పెంచుకున్నారు. అదే సందర్భంలో వ్యవసాయ రంగం నుండి ఉపాధి కోల్పోయినవారికి పారిశ్రామిక, సేవా రంగాలలో అవకాశం కల్పించారు. ప్రస్తుతం అమెరికా పారిశ్రామిక ఉత్పత్తి విలువ 1.264 ట్రిలియన్‌ డాలర్లు మాత్రమే. అనగా వారి మొత్తం ఉత్పత్తిలో 5.4శాతం వాటా కలిగిఉంది. వ్యవసాయ ఉత్పత్తి విలువ 164.7 బిలియన్‌ డాలర్లు కాగా, జిడిపిలో ఇది 0.7శాతం మాత్రమే. ఆవిధంగా ప్రజలకు ఉపాధి కల్పించడానికి పారిశ్రామిక, సేవారంగాలను పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. ప్రజలకు కావలసిన ఆహారధాన్యాలను మాత్రమే ఉత్పత్తి చేయకుండా ఎగుమతులకు కావలసినంత ఉత్పత్తులు చేస్తున్నారు. పారిశ్రామిక, సేవారంగాల ఉత్పత్తులను 5,6 రెట్లు పెంచుకోవడం ద్వారా వ్యవసాయ జీడీపీ తగ్గినట్టు కనిపించినా, గత ఉత్పత్తిపై అదనంగానే పండించారు.
దేశంలో వ్యవసాయ పరిశోధనలు తగ్గుదల
భారతదేశంలో నేటికీ చాలా ప్రాంతాలలో ఫ్యూడల్‌ వ్యవసాయ విధానమే కొనసాగుతున్నది. ఇంకా పెట్టుబడిదారీ వ్యవసాయ విధానంలోకి వంద శాతం మారలేదు. అలా మారినప్పుడు ఆహారధాన్యాలు కాక వాణిజ్యపంటలను పెట్టుబడిదారీ విధానం ద్వారా పండించి, ఎగుమతులు చేసి దేశానికి అదనపు ఆదాయాన్ని రాబట్టవచ్చు. ప్రపంచంలో భారతదేశం 41కోట్ల ఎకరాల సాగుభూమితో మొదటిస్థానంలో ఉండగా, అమెరికా 39కోట్ల ఎకరాలతో 2వ స్థానంలో ఉంది. చైనా 33కోట్ల ఎకరాల సాగుభూమితో మూడవ స్థానంలో ఉంది. 2, 3 స్థానంలో ఉన్న దేశాలలో మనకన్నా ఉత్పత్తి ఎక్కువ సాధిస్తున్నారు. అధునాతన సాంకేతికతను వినియోగించడమే కాక ఆ రెండు దేశాలలో మొత్తం యంత్రాల ద్వారానే వ్యవసాయ పనులు సాగుతున్నాయి. చెరుకు కోత యంత్రం మొదలు అన్ని రంగాలకు యాంత్రీకరణతో పనులు సాగుతున్నాయి. నిరంతరం నూతన వ్యవసాయ పరిశోధనలు కూడా కొనసాగుతున్నాయి. దేశంలో 2000సంవత్సరం నుండి వ్యవసాయ పరిశోధనలను 75శాతం తగ్గించారు. అదే సందర్భంలో యాంత్రీకరణ పరిశోధన కూడా 50శాతం తగ్గించారు. ఆర్థికంగా దేశాన్ని అభివృద్ధి పరిచేందుకు దోహద పడే యాంత్రీకరణ పరిశోధనను తగ్గించడం ఉత్పత్తి, ఉత్పాదకతలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ప్రస్తుత కాలమే కాక రానున్న కాలంలో ఎవరూ వ్యవసాయ పనులకు వచ్చే పరిస్థితి కనబడటంలేదు. అలాంటి పరిస్థితులలో దేశం స్వయం పోషకత్వం కావడానికి కావలసిన యంత్రాలను ఉత్పత్తి చేయాలి. మండల స్థాయిలో ”అద్దె, కొనుగోళ్ళు” పద్ధతిపై యంత్రాలను రైతులకు అందుబాటులో ఉంచాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా రైతులకు, ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులకు యంత్రాలను అందించే పని చేయాలి. జపాన్‌లో సాగుభూమి 1.03కోట్ల ఎకరాలు కాగా, ఆ దేశంలో ఉన్న 12కోట్ల మందికి కావలసిన ఆహారధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 1.63కోట్ల ఎకరాల సాగుభూమి ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న 4.3కోట్ల మంది ప్రజలకు కావలసిన ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయలేకపోతున్నాము. పప్పులు, పంటనూనెలు, కూరగాయలు, ఉల్లి, సుగంధ ద్రవ్యాలు లాంటి పంటలను ఇప్పటికీ దిగుమతి చేసుకుంటూనే ఉన్నాము. యంత్రాలతో కోయడానికి వీలుగా పంటల విధానాన్ని మార్చాలి. ఒకేసారి కోతకు వచ్చే విధంగా విత్తనాలను ఉత్పత్తి చేయాలి. మొక్కజొన్న కోత యంత్రాలు జయప్రదంగా పనిచేస్తున్నాయి. పత్తి రాష్ట్రంలో 70లక్షల ఎకరాలలో వేయడం వలన కూలీల కొరత తీవ్రంగా ఉంటున్నది. చైనాలాగా సింగిల్‌ పికింగ్‌ పత్తిని ఉత్పత్తి చేసి యంత్రాల ద్వారా పత్తి ఏరడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. దేశంలో వ్యవసాయ యంత్రాల ఉత్పత్తికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాలు, జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసేవిధంగా సహకరించాలి. రాష్ట్రాలు కూడా స్థానిక అవసరాలకు తగినట్టు చిన్న యంత్రాలను ఉత్పత్తి చేసి రైతులకు అందించాలి. తగిన సబ్సిడీ కూడా ఇవ్వాలి. బడ్జెట్‌లో యాంత్రీకరణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అదనపు నిధులు కేటాయించాలి. ఆవిధంగా వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను వృద్ధి చేయాలి.
సారంపల్లి మల్లారెడ్డి
సెల్‌: 9490098666