భారత్‌, పాక్‌ పోరు అక్టోబర్‌ 14న!

 India and Pakistan fight on October 14!షెడ్యూల్‌ మార్పునకు పీసీబీ అంగీకారం
ముంబయి : 2023 వన్డే వరల్డ్‌కప్‌లో దాయాదుల మెగా మ్యాచ్‌ అక్టోబర్‌ 14న జరుగనుంది. ఈ మేరకు ఐసీసీ, బీసీసీఐ త్వరలోనే రీ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నాయి. తొలుత అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌లో భారత్‌, పాక్‌ షెడ్యూల్‌ చేసినా.. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆ రోజు భద్రతా ఏర్పాట్లు కష్టసాధ్యమని స్థానిక పోలీసులు బోర్డుకు లేఖ రాశారు. అయితే, అక్టోబర్‌ 12న హైదరాబాద్‌లో శ్రీలంకతో మ్యాచ్‌ ఉండటంతో తొలుత పాకిస్థాన్‌ షెడ్యూల్‌ మార్పునకు అంగీకరించలేదు. కానీ శ్రీలంక, పాకిస్థాన్‌ మ్యాచ్‌ను అక్టోబర్‌ 10కి రీ షెడ్యూల్‌ చేయనున్నారు. దీంతో భారత్‌తో మ్యాచ్‌కు పాకిస్థాన్‌కు ఆశించిన సమయం ఉంటుంది. ఇక అక్టోబర్‌ 14న ఇప్పటికే రెండు మ్యాచులు షెడ్యూల్‌ చేయగా.. వాటిలో ఓ మ్యాచ్‌ను ముందు రోజు (13)కు మార్చనున్నారు. వంద రోజుల కౌంట్‌డౌన్‌తో ఎంతో ఆలస్యంగా షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ.. ఇప్పుడు టోర్నీకి రెండు నెలల ముంగిట షెడ్యూల్‌లో మార్పులు చేసేందుకు పూనుకుంది. మ్యాచ్‌ టికెట్లు, ధరలపై సైతం బోర్డు నుంచి ఎటువంటి సమాచారం లేకపోవటంతో అభిమానులు విమర్శలు చేస్తున్నారు.