భారత్‌, పాక్‌ ఢీ సెప్టెంబర్‌ 2న

– ఆసియా కప్‌ 2023 షెడ్యూల్‌ విడుదల
ముంబయి : ఆసియా కప్‌ షెడ్యూల్‌ ఖరారు. భారత్‌, పాకిస్థాన్‌ సెప్టెంబర్‌ 2న కాండీలోని పల్లెకల్‌ స్టేడియంలో తలపడనున్నాయి. సూపర్‌-4 దశలో సెప్టెంబర్‌ 10న మరోసారి దాయాదులు ఢకొీట్టనున్నాయి. ఆగస్టు 30న ముల్తాన్‌ (పాక్‌)లో పాక్‌, నేపాల్‌ మ్యాచ్‌ ఆసియా కప్‌ ఆరంభం కానుంది. ఆరు జట్లు పోటీపడుతున్న 13 మ్యాచుల రీజినల్‌ ఈవెంట్‌ సెప్టెంబర్‌ 17న కొలంబోలో ఫైనల్‌తో ముగియనుంది. గ్రూప్‌ దశలో భారత్‌, నేపాల్‌ మ్యాచ్‌ కాండీలోనే సెప్టెంబర్‌ 4న జరుగనుంది. సూపర్‌-4లో భారత్‌ సెప్టెంబర్‌ 12, 15న మిగతా మ్యాచులు ఆడనుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ జై షా బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు.