డంబ్లిన్: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కాడంతో ఐర్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. ల్యాండర్ జాబిల్లిపై దిగే ఉత్కంఠ క్షణాలను చూసేందుకు టెలివిజన్‌ల ముందు నిల్చొని ఆసక్తిగా తిలకించారు. విజయవంతంగా ల్యాండర్ చంద్రునిపై దిగడంతో ఆటగాళ్లు కేరింతలు కొడుతూ ఆనందంలో ముగినితేలారు.