చంద్రయాన్‌-3కి ముందే ‘భారత్‌’ ప్రయత్నాలు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశం పేరును ‘ఇండియా’కు బదులుగా భారత్‌ అని పిలిచే చర్యలు చంద్రయాన్‌-3 విజయవంతమవడానికి ముందే ప్రారంభమయ్యాయి. ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా, గ్రీస్‌ దేశాల్లో పర్యటించేందుకు వెళ్లినపుడే ‘ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌’ అని రాశారు. అయితే జీ20 దేశాధినేతలకు రాష్ట్రపతి భవన్‌ పంపించిన ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అని కనిపించడంతో మాత్రమే ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ప్రధాని మోడీ గత నెల 22 నుంచి 25 వరకు దక్షిణాఫ్రికా, గ్రీస్‌ దేశాల్లో పర్యటించారు. జొహెన్నస్‌బర్గ్‌లో 15వ బ్రిక్స్‌ సమావేశాలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్‌లో ‘ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌’ అని రాశారు. చంద్రయాన్‌-3 గత నెల 23న విజయవంతం అయింది. ఇదిలావుండగా, జీ20 నేతల సమావేశంలో పాల్గొనే భారతీయ అధికారు లకు జారీ చేసే గుర్తింపు కార్డుల్లో ‘ఇండియన్‌ అఫిషియల్‌’కు బదులుగా ‘భారత్‌ అఫిషియల్‌’ అని రాశారు. మోడీ ఈ నెల 6, 7 తేదీల్లో ఇండోనేషి యాలో పర్యటిస్తున్నారు. ఆసియన్‌ ఇండియా సమ్మిట్‌, ఈస్ట్‌ ఆసియా సమ్మిట్‌లలో ఆయన పాల్గొంటారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ నోటిప ˜ికేషన్‌లో కూడా ఆయనను ‘ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌’ గానే పేర్కొంది.