శంషాబాద్‌ సీహెచ్‌సీలో వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి

Infant died due to negligence of doctors in Shamshabad CHC– డాక్టర్లు పర్యవేక్షణ లేకుండా కాన్పు నర్సులపైనే భారం
– గర్భవతిని కాన్పు కోసం అడ్మిషన్‌ చేసుకున్న డాక్టర్‌
– కాన్పు చేయకుండా ముందుగానే వెళ్లిపోయిన వైనం
– శంషాబాద్‌ సామాజిక ఆరోగ్య కేంద్రంలోని దుస్థితి
నవతెలంగాణ-శంషాబాద్‌
వైద్య వైద్యుల పర్యవేక్షణ లేదా వైద్యులే చేయాల్సిన కా న్పుల విషయాన్ని నర్సులపై వదిలేసి వైద్యులు వైద్యా ధికారులు తమ విధులను విస్మరిస్తున్నారు. ప్రయివేట్‌లో వైద్యం చేయించుకోలేని పేదలు ప్రభుత్వఆస్పత్రి కి వస్తే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలుగాల్లో కలుస్తున్నా ుు. ప్రభుత్వం ప్రజా వైద్యంలో చాలా ప్రగతిని సాధించామని ప్రకటనలు చేస్తున్న క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైద్యుల పర్యవేక్ష ణలో జరగాల్సిన సాధారణ కాన్పు నర్స్‌ చేయడంతోనే వైద్యం వికటించి బాలింత మతి చెందిన సంఘటన శంషాబాద్‌ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 11 వ తేదీన జరిగింది. కాన్పు కోసం అడ్మిట్‌ చేసుకున్న డాక్టర్‌ రాధిక ఏమాత్రమూ పట్టించుకోకుండా కాన్పు చేయకుం డా నర్సుల మీదకి వదిలేసి డ్యూటీ ముగించుకొని వెళ్ళిపోయింది. శంషాబాద్‌ మండల పరిధిలోని పాల మాకులకి చెందిన మద్దూరి పావని (20) భద్రాచలంకు చెందిన సాయికిరణ్‌ తో 2022లో వివాహం జరిగింది. గర్భం దాల్చిన తర్వాత 2 నెలల క్రితం కాన్పు కోసం పాల మాకుల లోని తన అమ్మగారింటికి వచ్చింది. ఆమెకు పరి చయం ఉన్న ఆశావర్కర్‌ సహకారంతో శంషాబాద్‌ సా మాజిక ఆరోగ్య కేంద్రానికి ఈనెల 11 వ తేదీన ఆసుపత్రికి వచ్చింది. ఈ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్‌ రాధిక ఆమెను 12: 30 నిమిషాలకు అడ్మిట్‌ చేసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం డాక్టర్‌ రాధిక డ్యూటీ ముగించుకొని వెళ్లారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా మతురాలి కుటుంబ బంధు వులు ఒత్తిడితో అక్కడ విధులు నిర్వహిస్తున్న సలోమి అనే నర్సురాత్రి 7 గంటలకు సమయంలో కాన్పు చేసింది. ఈ కాన్పులో మగ బిడ్డకు పుట్టింది. కాన్పు చేసే సమయంలో జరిగిన పొరపాటు వలన గర్భసంచితో పాటు మాయి కలి సి ఒకేసారి బయటికి వచ్చాయి. ఈ విషయంలో ఆమెకు అవగాహన లేకపోవడంతోని సేదేమి లేక అంబులెన్స్‌ ను పిలిపించి నగరంలోని ఆస్పత్రికి తరలిస్తుంటే మార్గమ ధ్యంలో చనిపోయింది. అయితే పావనికి కాన్పు చేసి ఆమె మతికి ప్రత్యక్ష కారణమైన పి. సలోమి ఉదయం 11 గం టల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు వీడియో కాన్ఫరెన్స్‌ లో ఉంది. డ్యూటీ డాక్టర్‌ రాధిక నిర్లక్ష్యం తీసుకో వాల్సిన బాధ్యత తీసుకోకుండా వెళ్లడం పర్యవేక్షించాల్సిన మెడికల్‌ ఆఫీసర్‌ సెలవులో ఉండడంవల్ల సమస్యకు కారణమైంది. కాన్పు చేయాలని నిర్ధారించి తర్వాత ఆ డాక్టర్‌ గర్భిణీకి కా న్పు చేయకుండా నిర్లక్ష్యంగా నర్సుల మీదకు తోసి వెళ్లిపో యింది. దీంతో వైద్యం వికటించి పావని చనిపోయింది.
శంషాబాద్‌ సిహెచ్‌సి
ఆస్పత్రి గత సంవత్సరం క్రితం డిఎం అండ్‌ హెచ్‌ ఓ రాష్ట్ర పరిధి నుంచి వైద్య విధాన పరిషత్‌ ఆధీనంలోకి వచ్చింది. అప్పటినుంచి ఇక్కడ 24 గంటల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. నలుగురు వైద్యులు, 6 మం ది నర్సులను ఇతర సిబ్బందిని నియమించింది. ముగ్గురు డాక్టర్లు షిఫ్టింగ్‌ పద్ధతిలో 24 గంటలు విధులు నిర్వ హించాల్సి ఉంది. మరొక డాక్టర్‌ ఇతరులు సెలవులలో ఉ న్నట్టు ఉన్నప్పుడు అందుబాటులో ఉండాలి. కానీ డాక్టర్లు 4 గంటల సమయం వరకు మాత్రమే విధులు నిర్వహి స్తూ ఆపై వెళ్ళిపోతున్నారు. ఒక్క డాక్టర్‌ లేకుండా నర్సుల మీదనే భరోసా ఉంచి వైద్యులు ఫోన్‌ ద్వారా విధులు నిర్వహించే నర్సులకు సూచనలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లను చూడాల్సిన నర్సులు ఏ విధంగా వైద్యం అందిస్తారన్న విషయాన్ని డాక్టర్లు విస్మరి స్తున్నారు.మెడికల్‌ ఆఫీసర్‌ సమయపాలన లేదు. 30 బెడ్లు ఆస్పత్రి 10 బెడ్లతో మాత్రమే కునసాగుతుంది. 200 నుంచి 300 వచ్చిన వారికి సరైన సదుపాయాలు లేవు
మెడికల్‌ ఆఫీసర్‌ గాయిత్రి వివరణ
పావని గర్భిణీ మొదట హై రిస్క్‌ పేషెంట్‌ అని చెప్పి సాధన కాన్పు చేయడానికి అవ కాశం ఉందని తప్పంతా డ్యూ టీ నర్సు మీదికి నెట్టేసింది. 24 గంటలు డాక్టర్లు ఆస్పత్రిలో ఉం డాల్సిన అవసరం లేదని సమ స్య ఉంటే ఫోన్‌ ద్వారా చెప్పి పేషెంట్‌కు చికిత్స ఇప్పిస్తా మని అంటున్నారు. సలోమి స్వంత తప్పిదం వల్ల జరిగిం దని చెప్పింది. డ్యూటీ డాక్టర్‌ రాధిక ఎందుకు అడ్మిషన్‌ చేసుకుంది కాన్పు సమయంలో ఎందుకు లేదని విషయం పై మాత్రం సమా ధానం దాటవేసింది. డ్యూటీ డాక్టర్లు విధులను విస్మరించి కిందిస్థాయి ఉద్యోగులను బలి పశువులను ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘనతను పునరావతం కా కుండా డాక్టర్లు 24 గంటలు ఆస్పత్రిలో తమ విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున వైద్యుల నిర్ల క్ష్యం కారణంగా బాలింత మతి చెందితే స్థానిక ప్రజాప్ర తినిధులు ఆరా తీసిన దాఖలాలు లేవు