జిల్లా ఆస్పత్రిలో ఇన్‌ ఫెర్టిలిటీ క్లినిక్‌ ప్రారంభం

నవతెలంగాణ – డెస్క్‌
జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఇన్‌ ఫెర్టిలిటీ క్లినిక్‌ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు.మంగళవారం జిల్లా ఆస్పత్రిలో ఓయాసి స్‌ హాస్పిటల్‌ ఇన్ఫినిటీ వరంగల్‌ వారి సహకారంతో ఇన్‌ ఫెర్టిలిటీ క్లినిక్‌ను జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆరోగ్య మహిళా క్లినిక్‌ను నిర్వహిస్తున్న క్రమంలో ఆరోగ్య మహిళా క్లినిక్‌ వచ్చిన మహిళల్లో 4280 మంది ఔట్‌ పేషంట్లలో 30 మంది పైగా మహిళలకు సంతానలేమి స్త్రీలను కనుగొనడం జరిగిందని అన్నారు. నెలలో చివరివారం మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ప్రత్యేకంగా సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఇబ్బంది కలుతుందని తెలిసి ములుగు జిల్లా ఆస్పత్రిలోఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.మహిళలు బిడియ పడకుండా తమకున్న సమస్యలు నేరుగా ఇన్ఫినిటీ ప్రత్యేక వైద్య నిపుణులకు చెప్పుకొని తగిన సేవలు పొందాలని కోరారు. ఈ సందర్భంగా ఓయాసిస్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ కావ్య మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ చొరవతో సేవ చేసేందుకు ముందుకు వచ్చామన్నారు.సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం ఈనెల 28న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ప్రారంభించ నున్న జిల్లా ఆస్పత్రిలో స్పెషల్‌ నియోనటల్‌ కేర్‌ యూనిట్‌ ముందస్తు ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ జగదీష్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అప్పయ్య, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.