రూ.వంద కోట్ల క్లబ్‌లో ఇన్ఫినిటీ లెర్న్‌ శ్రీచైతన్య

In the Rs.100 crore club Infinity Learn Sri Chaitanyaనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్యారంగంలో దూసుకెళ్తున్న ఇన్ఫినిటీ లెర్న్‌ శ్రీచైతన్య రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరి భారీ లాభాలను సాధించింది. ఈ మేరకు శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర, ఇన్ఫినిటీ లెర్న్‌ ఫౌండర్‌, డైరెక్టర్‌ సుష్మా బోపన్న, ఇన్ఫినిటీ లెర్స్‌ బై శ్రీచైతన్య వ్యవస్థాపక సీఈవో ఉజ్వల్‌ సింగ్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఐఎల్‌ విస్టా వర్చువల్‌ ఇంటెలిజెంట్‌ సిస్టమ్‌ ఫర టైలర్డ్‌ అకడమిక్స్‌ అని ప్రకటించారు. ఇందుకోసం ఒక మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టామని తెలిపారు. ఐఎల్‌ విస్టా రాబోయే దశల కోసం అదనంగా మిలియన్‌ డాలర్లు కేటాయించామని వివరించారు. ఐఎల్‌ విస్టా విద్యా ప్రపంచంలో సంచలనాత్మక సాంకేతిక కార్యక్రమమని పేర్కొన్నారు. ఇంటెలిజెంట్‌ సిస్టమ్‌ ఫర్‌ టైలర్డ్‌ అకడమిక్స్‌, విద్యార్థుల పూర్తి సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇది అధ్యాపకులు, అభ్యాసకులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరిస్తోందని వివరించారు. మొబైల్‌, వెబ్‌ అప్లికేషన్ల ద్వారా విద్యార్థులు, అభ్యాసకులు దీన్ని వినియోగించుకోవచ్చని సూచించారు.