పాఠశాలల్లో, కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి

– ఖాళీగా ఉన్న టీచర్, సావెంజర్ పోస్టులను భర్తీ చేయాలి

– రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి 
– జిల్లా వ్యాప్తంగా పాఠశాల, కళాశాలల జయప్రదం
– వామపక్ష విద్యార్థి సంఘాలు
నవతెలంగాణ- కంటేశ్వర్
పాఠశాలల్లో కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఖాళీగా ఉన్న టీచర్, స్కావెంజర్ పోస్టులను భర్తీ చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు కళాశాలల బంధు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడంతో జయప్రదమైందని వామపక్ష విద్యార్థి సంఘాల  ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యు, ఎఐపిఎస్యు, ఏఐఎఫ్డిఎస్, పిడిఎస్యు, ఏఐఎస్బి నాయకులు తెలిపారు.ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యు, ఎఐపిఎస్యు, ఏఐఎఫ్డిఎస్, పిడిఎస్యు, ఏఐఎస్బి నాయకుల పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పాఠశాల,కళాశాలల బంద్ నిర్వహించడం జరిగింది…. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐపిఎస్్యు, జిల్లా కార్యదర్శి జ్వాల, ఏఐఎస్బి రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల అమరవీరుల త్యాగాల పునాది మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఇప్పటివరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయకుండా నాన్ నాంచుతూ విద్యకు దూరం చేసే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది.. చేరినటువంటి కళాశాలలో రియంబర్స్మెంట్ రాక జేబులో నుంచి డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నత చదువులకై ఫీజు చెల్లించే సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితిఈరోజు విద్యార్థుల్లో ఉంది… అలాగే ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక వర్షానికి నీరు చేరి అదే తరగతి గదుల్లో కూర్చొని బోధన కొనసాగించవలసిన అటువంటి దుస్థితిలో ఈరోజు పాఠశాలల్లో నిలకలై ఉండి అలాగే ఇప్పటివరకు కూడా పూర్తిస్థాయిలో యూనిఫాంలు రాలేవు ఇక కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులకు అడ్డు అదుపు లేకుండా వసూలు చేస్తూ రకరకాల పేర్లతో తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు వీటన్నిటి పైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఫీజు నియంత్రణ చట్టము అట్లాగే పాఠశాలలో మౌలిక వసతులు అట్లానే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను భర్తీ చేయాలి అని రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బందుకు పిలుపునివ్వడం జరిగిందని జిల్లా వ్యాప్తంగా పాఠశాలలో కళాశాలలు కూడా ఈ బందుకు సహకరించి విజయవంతం చేసినందుకు వామపక్ష విద్యార్థి సంఘాలుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్, రఘురాం ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, పిి డి ఎస్  జిల్లా కార్యదర్శి కర్క గణేష్, ఏఐఎస్బి జిల్లా కన్వీనర్ గజానంద్, ఏఐపీఎస్ యు జిల్లా నాయకులు సాయి, ఏఐఎఫ్డిఎస్ జాతీయ కన్వీనర్ మైత్రి రాజశేఖర్, వివిధ సంఘాల జిల్లా నాయకులు మహేష్ ,దీపిక గోపాల్ ,సాయి కుషన్, వంశీ, ఎస్.కె అశుర్ , దేవిక మనోజ్ నిఖిల్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.