సైబర్‌ టవర్‌ వద్ద దీక్ష

నవతెలంగాణ-హైదరాబాద్‌
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ను అక్రమంగా అరెస్టు చేసిన కారణంగా ఐటీడీపి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు హరికష్ణ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌ లోని సైబర్‌ టవర్‌ వద్ద మౌన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు ఆయనకు మద్దతు ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగాన్ని నెలకొల్పి దేశ,విదేశాల్లో లక్షలాది మందికి ఉపాధి కల్పించి చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టడాన్ని ఆయన ఖండించారు. ఐటీ రంగంలో విద్యార్థులు, ఉద్యోగులు ఆర్దికంగా బలోపేతం కావడానిక,ి ముందు చూపుతో..భరోసాను మాజీ సీఎం చంద్రబాబు కల్పించారని గుర్తు చేశారు.