– పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు : హౌంమత్రి మహమూద్ అలీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో ఆరుగురు ఉగ్రవాదులను ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపింది. మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు భోపాల్, హైదరాబాద్‌లలో ఉగ్రవాదులను మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులకు వారు సిద్ధపడినట్టు అధికారులు వెళ్లడించారు. ఈ క్రమంలో రాష్ట్ర నిఘా వర్గాలు, పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. గురువారం హౌం మంత్రి మహమూద్ అలీ మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారనీ, ఎలాంటి ఘనలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. నగరంలో ఉగ్ర కదలికలపై అన్ని కోణాల్లో దార్యప్తు చేస్తున్నామని తెలిపారు. నగరంలో ఆరుగురు పట్టుబడిన వారి వివరాలతోపాటు వారికి ఆశ్రయం కల్పించిన వారి వివరాలను రాబడుతున్నామన్నారు.