పంచాయితి నిధులు దుర్వినియోగంపై విచారణ

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని జమ్మిగూడెం, ఆసుపాక పంచాయితీల్లో నిధులు దుర్వినియోగం మంగళవారం డిఎల్.పిఒ రాజీవ్ కుమార్ విచారణ చేపట్టారు. నిధులు దుర్వినియోగం స్వయానా పాలకవర్గంలోని కొందరు సభ్యులే కలెక్టర్, డిపి.ఒలకు పిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన ఈ రెండు పంచాయితీల్లో విచారణ జరిపి, సభ్యులుచే రాతపూర్వక సమాచారం సేకరించారు. సంబందిత రికార్డులను సీజ్ చేసి తీసుకెళ్ళారు.