
– వేద సాగు, డ్రమ్ సీడర్ పద్దతి పంటలను
– పరిశీలించిన దుబ్బాక మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ కుమార్,ఏఈవోలు
నవతెలంగాణ -దుబ్బాక రూరల్
దుబ్బాక మండలం గంభీర్పూర్, హబ్సిపూర్ గ్రామాలతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట వార్డ్ లో మంగళవారం మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ ఏఈవోలతో కలిసి పలు పంటలను, వరిలో వెద సాగు, డ్రమ్ సీడర్ పద్ధతిలో సాగు చేస్తున్న వరి విధానాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామాల్లో ఏఈవోలు చేస్తున్న పంటల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించి, రైతు బీమా పథకంలో నమోదైన రైతుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు బీమాకి సంబంధించిన కొత్త రైతుల లిస్టులు, పాత రైతులు వారి నామినీని గాని ఇతర మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నచో ఈ నెలాఖరు వరకు చేసుకోవాలన్నారు. రైతులకు ఈ విషయంలో సందేహాలు ఉంటే ఏఈఓ లను సంప్రదించాలని సూచించారు. ఖరీఫ్ సీజన్లో రైతులు తప్పనిసరిగా వారు వేసిన పంటలను ఏఈఓ ల దగ్గర నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఈవోలు సురేందర్, మహేష్ ,రేణుక, రైతుబంధు సభ్యులు పాల్గొన్నారు.