నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సమక్షంలో శనివారం ఏనుమా ముల వ్యవసాయ మార్కెట్ గోడౌన్ లలో భద్రపరిచిన ఈవీఎం, వివి ప్యాట్‌లను అధికారుల బృందం వివిధ పార్టీల ప్రతినిధులు పరిశీలించారు. కాంగ్రెస్ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ తక్కల్లపల్లి రవీందర్ రా వు, బీఎస్పీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మంద శ్యామ్‌లతోపాటు గుర్తింపు పొందిన ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ ప్రావీ ణ్య గోడౌన్ ప్రధాన ద్వారం వద్ద సీజ్ చేసిన తాళాలను తీసి బాక్సులను పరిశీలించారు. అనంతరం నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గం పోలింగ్ బూతులను రాండం ద్వారా కేటాయించిన ఈ వీఎం, వీవీప్యాట్‌లను గోడౌన్‌ల నుండి బయటకు తీసి నియోజకవర్గాల వారీగా కేటాయించిన ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నిం గ్ అధికారులకు అప్పగించారు.ఈ సందర్భంగా పోలింగ్ సమయాలలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటిం చాలని, ఈవీఎంలపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి, వారికి విశ్వాసం కల్పించాలని కలెక్టర్‌ను రవీందర్‌రావు కోరారు.