జాతీయ నాణ్యత ప్రమాణాల సూచిక బృందం తనిఖీ

నవతెలంగాణ-జమ్మికుంట
కరీంనగర్ జిల్లాలో 97 హెల్త్ వెల్నెస్ సెంటర్స్ కలవని, ఇందులో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జమ్మికుంట 2  హెల్త్ వెల్నెస్ సెంటర్ ని ఎన్ క్యూ ఏ ఎస్ సర్టిఫికేషన్ కొరకు రాష్ట్రస్థాయి అధికారుల సూచించిన మేరకు నాణ్యత ప్రమాణాలు లెక్కించుటకు శుక్రవారం కేంద్ర బృందం  జమ్మికుంటలో తనిఖీ నిర్వహించారు. ఇందులో ఆరోగ్య కార్యక్రమాలను, రికార్డులను , జన ఆరోగ్య సమితి సమావేశాలను,సీజనల్ డిసీస్ రికార్డులను,హెల్త్ వెల్నెస్ సెంటర్స్ పరిశుభ్రతను, ఆన్ లైన్ డాటాను  పరిశీలించారు.ఇందులో 100 మార్కులకు గాను 70కి పైబడిన మార్కులు సాధించినట్లయితే జాతీయస్థాయి ప్రశంస పత్రము  1,28,000 రూపాయలు లభించడం జరుగుతుందని తెలిపారు. పారితోషికంలో 25 శాతము ఆరోగ్య సిబ్బందికి, 75 శాతము హెల్త్ వెల్నెస్ సెంటర్ అభివృద్ధికివెచ్చించడంజరుగుతుందన్నారు. దీని ప్రగతి ప్రతి సంవత్సరం కేంద్ర బృందం తనిఖీ చేస్తూ, అందులో 70 శాతము మార్కులు సాధించి నట్లయితే పై విధంగా ప్రశంసా పత్రము పారితోషికం లభించునని తెలిపారు. ఈ  తనిఖీ బృందంలో డాక్టర్ ప్రీతిష్ సూర్యకాంత్ లోగడే ఎన్ క్యూ ఏ ఎస్, ఏ ఎస్ ఎస్ ఈ ఎస్ ఎస్ ఓ ఆర్ , డాక్టర్ సుబ్రహ్మణ్యం ,  మున్సిపల్ కౌన్సిలర్  పొనగంటి శ్రీలత సంపత్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవి  డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు, వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సన జవేరియా హెల్త్ వెల్నెస్ సెంటర్  డాక్టర్స్ మహోన్నత పటేల్ అపర్ణ, హిమబిందు, ఎన్ వివేకానంద రెడ్డి,డిపిఓ తులసి రవీందర్,క్వాలిటీ మేనేజర్ సాగర్,శంకర్ రెడ్డి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, రామనాథం డిస్ట్రిక్ట్ సబ్ యూనిట్ ఆఫీసర్, సూపర్వైజర్స్ రత్నకుమారి, అరుణ,సదానందం,అనిల్ కుమార్,శ్రీకాంత్  వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఆశాలు తదితరులు పాల్గొన్నారు.