నవతెలంగాణ – ఆర్మూర్: పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి ఎస్సై రాము ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ విస్తృతం చేసినారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వాహనదారులు సరియైన ధ్రువపత్రాలు దగ్గర పెట్టుకోవాలని, హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని ,మద్యం సేవించి వాహనాలు నడిపినచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వాహన తనిఖీలు పట్టణ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.