నవతెలంగాణ-భిక్కనూర్ : భిక్కనూరు మండలంలో 44వ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద శుక్రవారం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాలను తనిఖీలు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆధ్వర్యంలో ఎన్నికల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుండి మద్యం తరలించకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అక్రమ మద్యం రవాణా చేస్తే వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దోమకొండ సీఐ మధుసూదన్ రావు, ఎస్సై శ్రావణ్, హెడ్ కానిస్టేబుల్ మొయినొద్దీన్, కానిస్టేబుల్ వహీద్, జాకబ్, స్వాతి, బాలరాజు, తదితరులు ఉన్నారు.