స్ఫూర్తిదాయకం..శ్వేతవర్ణ శోభితం

– ఆకట్టుకున్న ఐద్వా కార్యకర్తల ర్యాలీ
మలప్పురం: కేరళలో మలప్పురంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కమిటీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఆదివారం నిర్వహించిన ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది. 1200 మంది మహిళా వాలంటీర్లు శ్వేత వర్ణ దుస్తులు యూనిఫాంగా ధరించి ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం. ఇంత పెద్ద సంఖ్యలో వివిధ సామాజిక తరగతులకు చెందిన మహిళలు ఐక్యంగా యూనిఫాం ధరించి ర్యాలీ చేయడం ఇదే తొలిసారి. ఐద్వా జిల్లా కార్యాలయాన్ని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ ప్రారంభించారు. ఐద్వా అధ్యక్షులు పికె శ్రీమతి పతాక ఆవిష్కరణ చేశారు.