నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
చిల్పూరు మండల కేంద్రంలోనే ప్రజా పరిపాల న విభాగపు సమీకత కార్యాలయాలు నెలకొల్పేెలా స హాకారం అందించాలని చిల్పూర్ ఎంపీపీ బొమ్మిశెట్టి సరితాబాలరాజు కోరారు. మంగళవారం జరిగిన స మావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నా యకత్వంలో నియోజకవర్గం ఎంతో అభివద్ధి చెం దిందని, గతంలో సాగునీరు, వ్యవసాయానికి సరైన కరెంటు లేక, ఎరువులు విత్తనాలు అందక రైతుకు తీ వ్ర ఇబ్బందులకు గురి అయ్యేవారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నూతనం గా ఏర్పాటైన చిల్పూర్ మండల అధ్యక్షురాలుగా తన కు అవకాశం రావడం ఎంతో తప్తిని ఇచ్చిందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ డి ప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ, అపార అనుభవం గల నాయ కులు కడియం శ్రీహరి రావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. మండలం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివ ద్ధి పనులు మండల కేంద్రంలో చేశామని, వారు వ స్తూనే రూ. 65కోట్ల పనులు తీసుకురావడం పట్ల ఈ ఎల్లవేళలా ఋణపడి ఉంటామని, అనేక సీసీ రోడ్ల ని ర్మాణం పూర్తి చేశామని, ఎన్‌ఆర్‌ఈజీఎస్, సీడీఎఫ్ ద్వారా రూ. 40 లక్షల పనులు పూర్తి చేశామన్నారు. ముఖ్యంగా ఈ మండల కేంద్రంలో అధికారిక కార్యా లయాలు నిర్మించే దిశగా తోడ్పాటు అందించాలని క డియంను కోరారు. గ్రామంలో సమ్మక్క సారలమ్మ జా తరకు వెళ్ళే దారి సుమారు 2 కిలో మీటర్ల మేరకు బీ టీ రోడ్డు మంజూరీ అయ్యేలా సహకారం కావాలని కోరగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ కడియం అన్ని కార్యాలయాలు మండల కేంద్రంలో ఉండాలనేది న్యా యమైన డిమాండ్ అని, ఎమ్మెల్యేగా తాను గెలిచిన ఒ క ఏడాదిలోపే మండల కాంప్లెక్స్ భవనాల ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో ఎంపిపి సరితా బాలరా జు, ప్రజలు కడియంకు కతజ్ఞతలు తెలిపారు.