ఒలింపియాడ్‌ పరీక్షల్లో హైదరాబాద్‌ విద్యార్థులకు అంతర్జాతీయ ర్యాంకులు

నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎస్‌ఓఎఫ్‌ ఒలింపియాడ్‌ పరీక్ష 2022-23లో హైద రాబాద్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు అంతర్జాతీయ ర్యాంకులు సాధించారు. పల్లవి మోడల్‌ స్కూల్‌లో పద కొండవ తరగతి చదువుతున్న రిషి శేఖర్‌ శుక్లా ఇంటర్నే షనల్‌ మ్యాథమెటిక్స్‌ ఒలింపియాడ్‌ ర్యాంక్‌ 1 సంపాదించి రూ.50వేల ఇంటర్నేషనల్‌ గోల్డ్‌ మెడల్‌, మెరిట్‌ సర్టిఫికేట్‌ పొందారు. వికాస్‌ ది కాన్సెప్ట్‌ స్కూల్‌ నుంచి తొమ్మిదో తరగతికి చెందిన ప్రాంజలి సింగ్‌, ఇంటర్నేషనల్‌ మ్యాథ మెటిక్స్‌ ఒలింపియాడ్‌ ర్యాంక్‌ 1, అంతర్జాతీయ గోల్డ్‌ మెడల్‌, మెరిట్‌ అందుకున్నారు. చిరెక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్న పొదిల శ్రేయాన్స్‌, ఇంటర్నేషనల్‌ మ్యాథమెటిక్స్‌ ఒలింపియాడ్‌ ర్యాంక్‌ 1 సంపాదించి, అంతర్జాతీయ గోల్డ్‌ మెడల్‌, మెరిట్‌ సర్టిఫికేట్‌ అందుకున్నారు. ఎస్‌ఓఎఫ్‌ ఒలింపియాడ్‌ పరీక్షలో 70 దేశాల నుంచి సుమారు 60 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు, ఒక్క హైదరాబాద్‌లోనే 2.85 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, సూర్య ది గ్లోబల్‌ స్కూల్‌, కెన్నెడీ హై ది గ్లోబల్‌ స్కూల్‌ వంటి పాఠశాలలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా 66 మంది అంతర్జాతీయ ర్యాంక్‌-1 విజేతలకు రూ.50వేలు, అంతర్జాతీయ బంగారు పతకం, మెరిట్‌ సర్టిఫికెట్‌తోపా టు, 66 అంతర్జాతీయ ర్యాంక్‌-2 విజేతలకు రూ.25వేలు, అంతర్జాతీయ రజత పతకం, మెరిట్‌ సర్టిఫికేట్‌, 66 అంతర్జాతీయ ర్యాంక్‌-3 హౌల్డర్లకు రూ.10వేలు, కాంస్య పతకం, మెరిట్‌ సర్టిఫికేట్‌ అందజేశారు. పాల్గొన్న 70 దేశాల నుంచి, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది ప్రధానోపాధ్యాయులు, టాప్‌ 60 మంది బోధకులను కూడా నగదు బహుమతులు, సావనీర్లు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు.