మణిపూర్‌లో శాంతి స్థాపనకు జోక్యం చేసుకోండి

Intervene for peace in Manipur

– ప్రజలు భయం, అభద్రతలో ఉన్నారు : రాష్ట్రపతికి ప్రతిపక్షాల వినతి
– అక్కడి అసాధారణ పరిస్థితిని పరిష్కరించాలి
– ఇంటర్నెట్‌ నిషేధం అపనమ్మకాన్ని పెంచింది
– పార్లమెంట్‌లో చర్చపై తాము ఇచ్చిన నోటీసులు తిరస్కరణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మణిపూర్‌లో ఆలస్యం చేయకుండా శాంతి స్థాపనకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రతిపక్ష నేతలు విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌ రాష్ట్రం ఎదుర్కొంటున్న అసాధారణ పరిస్థితిని వీలైనంత త్వరగా పరిష్కరించి, తక్షణమే సాధారణ స్థితికి తీసుకురావాలని కోరారు. రెండు రోజుల పాటు మణిపూర్‌లో పర్యటించిన 21 మంది ఎంపీలతో పాటు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్‌ లీడర్లు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వినతి పత్రం సమర్పించారు. ”గత కొన్ని వారాలుగా మణిపూర్‌లో పరిస్థితి క్లిష్ట స్థితికి చేరుకుంది. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆన్‌లైన్‌లో వెలువడిన షాకింగ్‌ వైరల్‌ వీడియో దేశాన్ని ద్రిగ్భాంతికి గురిచేశాయి. ఈ పరిస్థితుల్ని వెంటనే పరిష్కరించడంలో రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ, పోలీసులు విఫలమయ్యారని స్పష్టంగా తెలుస్తుంది. విచారణ చేపట్టి నిందితుల్ని పట్టుకునేందుకు రెండు నెలలకు పైగా ఆలస్యంగా స్పందించడం సమస్య తీవ్రతను మరింత పెంచింది. మహిళలపై లైంగికదాడులకు సంబంధించిన అనేక కేసుల్లో ఒక ఘటన మాత్రమే అని వెలుగులోకి వచ్చింది” అని తెలిపారు. ”బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఇండియా కూటమి పార్టీలకు చెందిన 21 మంది పార్లమెంట్‌ సభ్యుల ప్రతినిధి బృందం జులై 29-30 తేదీల్లో రెండో రోజుల పాటు మణిపూర్‌లోని హింసా ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, మణిపూర్‌ ప్రజలకు సంఘీభావ సందేశాన్ని ఇచ్చి, వాస్తవికతను అంచనా వేసింది. మహిళలు, పిల్లలతో సహా ప్రజలు ఎదుర్కొంటున్న విధ్వంసం, కష్టాలను ఎంపీలు చూశారు. భయంకరమైన, పరిస్థితుల గురించి దేశానికి తెలియజేశారు. ఇంతకు ముందు మణిపూర్‌ గవర్నర్‌ను ప్రతినిధి బృందం కలిసి వాస్తవ పరిస్థితులను తెలియజేసింది. ఆమెకు వినతిపత్రం సమర్పించింది” అని పేర్కొన్నారు.
”హింసతో మణిపూర్‌ వినాశకరంగా మారింది. 200 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. 500 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. 5 వేల కంటే ఎక్కువ ఇళ్లు దగ్ధం అయ్యాయి. 60 వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సహాయక శిబిరాల్లో దుర్భరమైన పరిస్థితుల్లో బాధితులు నివసిస్తున్నారు. చురచంద్‌పూర్‌, మోయిరాంగ్‌, ఇంఫాల్‌తో సహా మూడు విభిన్న సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లోని సహాయక శిబిరాలను ప్రతినిధి బృందం సందర్శించింది. అక్కడ బాధితులతో సంభాషించింది. వారి సమస్యలను విన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల జీవన పరిస్థితులను వారు ప్రత్యక్షంగా చూశారు. సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజల ఆహారం, సహాయక సామాగ్రి సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు భయం, అభద్రతా స్థితిలో జీవిస్తున్నారు. వారి జీవితాలను పునర్నిర్మించుకోవడానికి సురక్షితమైన, న్యాయమైన పునరావాసం అవసరం. రాష్ట్రంలో మూడు నెలల పాటు ఇంటర్నెట్‌ నిషేధం వివిధ వర్గాల మధ్య అపనమ్మకాన్ని మరింత పెంచింది. తప్పుడు సమాచారం వ్యాప్తికి అనుమతించింది. దాదాపు మూడు నెలల పాటు పాఠశాలలు, కళాశాలలను సుదీర్ఘంగా మూసివేయడం మణిపూర్‌లో పిల్లలు, యువత విద్యపై ప్రతికూల ప్రభావం చూపింది” అని వినతిపత్రంలో తెలిపారు.
”ఈ సందర్భంలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి, ఇండియా కూటమి పార్టీలు ప్రధాని నుంచి ప్రకటనను డిమాండ్‌ చేస్తున్నాయి. ఆ తరువాత అత్యంత జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ అంశంపై వివరణాత్మక, సమగ్ర చర్చ జరగాలని కోరుతున్నాయి. సంబంధిత నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చినప్పటికీ, ఈ డిమాండ్‌లు పార్లమెంట్‌ ఉభయ సభల్లో తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారు. రాజ్యసభలో ప్రజల గొంతుకకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిపక్ష నేత నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. తాము మాట్లాడకుండా మైక్‌ కట్‌ చేస్తున్నారు. దీన్ని మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కొత్తగా తీసుకురావడం చాలా ఆందోళన కలిగిస్తుంది” అని అన్నారు.
”ఇకనైనా ఆలస్యం చేయకుండా రాష్ట్రంలో శాంతి సామరస్యాలను నెలకొల్పేందుకు దయతో జోక్యం చేసుకోండి. గత 92 రోజులలో జరిగిన విధ్వంసానికి బాధ్యలను గుర్తించాలి. బాధిత వర్గాలకు న్యాయం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం రెండూ తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలి. మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులపై పార్లమెంట్‌లో అత్యవసరంగా ప్రసంగించవలసిందిగా ప్రధానమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలి. ఆ తరువాత ఈ విషయంపై వివరణాత్మక, సమగ్రమైన చర్చ జరగాలి” అని కోరారు. మణిపూర్‌ ప్రజల బాధలను తగ్గించడంలో, రాష్ట్రంలో సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో మీ మద్దతు, జోక్యం చాలా కీలకమని కోరారు. ఈ కీలకమైన అంశంపై శ్రద్ధ వహించాలనీ కోరారు.
అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ తాము మణిపూర్‌ సమస్యను రాష్ట్రపతికి వివరించామని చెప్పారు. మణిపూర్‌లో మహిళలపై దురాగతాలు జరుగుతున్నాయని, పునరావాస కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేవని చెప్పామని తెలిపారు. ప్రధాని మోడీ మణిపూర్‌లో పర్యటించి, శాంతిని పునరుద్ధరించేందుకు కృషి చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్‌ అని అన్నారు. మణిపూర్‌లో పర్యటించిన 21 మంది ఎంపీలతో పాటు శరద్‌ పవర్‌ (ఎన్‌సీపీ), సుదీప్‌ బందోపాధ్యాయ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), ఫరూక్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫెరెన్స్‌), వైకో (ఎండీఎంకే), జోష్‌ కె. మణి (కేరళ కాంగ్రెస్‌), ఎఎ రహీం సీపీఐ(ఎం), సంజరు సింగ్‌ (ఆప్‌), సంజరు రౌత్‌ (శివసేన ఠాక్రే), రామ్‌ గోపాల్‌ యాదవ్‌ (ఎస్‌పీ) తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 16:38):

natures tru cbd nxN gummies 2000mg | cbd KKE gummies true bliss | Nz8 best cbd gummies at walgreens | cbd gummies apple rings XWd | large quantity of JuG cbd gummies | best cbd gummies TYP for pain relief | cbd oil qV5 sundowners syndrome gummies | plus cbd 5hd gummies anxiety | cbd gummies tuscaloosa al pbe | vitamin store q60 that carry cbd gummies | how DVW often do you eat cbd gummies | is cbd swW gummies good for back pain | garden of life cbd gummy eAv bears | gummy cbd sour AMK twerps | cherry vita cbd gummies iO4 | full spectrum cbd J8n gummies weedmaps | eclipse wild earth cbd qgX gummies | does JYW cbd gummies cause weight gain | cbd gummie hMc greensboro nc | reviews kQ8 of people taking cbd gummies | bulk cbd H48 gummies wholesale | alpha iq qPl cbd gummies | shop cbd relax OpH gummy | dragons XFA den cbd gummies | do super cbd gummies work for JAY hair loss | cbd gummies safe while riP breastfeeding | cbd gummies give XpE me diarrhea | MAG how much cbd gummies for beginner | cbd lVD gummies top brands | cbd full spectrum gummies Dux for pain | are cbd gummies legal 3Os in europe | do i ACV need a prescription for cbd gummies | cbd gummy bears vNc just cbd | bluebird for sale cbd gummies | mia relief cbd gummies FEa | cbd gold official gummies | sKi pure kana premium cbd gummies cost | cbd gummies xy4 anxiety reddit | best nsM cbd gummies on amazon | zVo where can i get cbd gummies for sleep | nicotine blocking M0Y cbd gummies | cbd gummies help Byn get you high | cost of UYT cbd gummies for diabetes | legal low price cbd gummies | what is cbd gummies do for you CAL | cbd gummy reviews 3d9 top | botanical farms chS cbd gummies contact number | organic cbd gummies lko bulk | cbd sour gummy bears 1000mg wa 3lT | wholesale white label cbd n6O gummies