ఆరు గ్యారంటీల పోస్టర్‌ ఆవిష్కరణ

నవతెలంగాణ- బాలానగర్‌
సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీల పోస్టరును ఆదివారం బాలానగర్‌ మండల కేంద్రంలో ఆవిష్కరించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్‌ రెడ్డి గత నెల 17న తుక్కుగూడలో రాష్ట్ర ప్రదేష్‌ కాంగ్రెస్‌ కమిటీ నిర్వహించిన విజయభేరిసభలో ముఖ్యఅతిథిగా సోనియా గాంధీ విచ్చేసి ఆమె ప్రకటించిన 6 గ్యారంటీల పోస్టర్‌ను టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్‌ రెడ్డి బాలానగర్‌ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జడ్చర్ల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో గడపగడపకు వెళ్లి ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు శంకర్‌ నాయిక్‌ టీపీసీసీ ప్రతినిధి నందమూని దత్తాత్రేయ , డిస్టిక్‌ సేవాదళ్‌ ప్రెసిడెంట్‌ జి రాజేష్‌ రెడ్డి, అనుబంధ మండల ప్రెసిడెంట్స్‌,రాఘవేందర్‌ యాదవ్‌, అనసూయ, బద్రునాయక్‌, నరసింహారెడ్డి,యాదయ్య , మహేందర్‌, రఫీక్‌, మండల్‌ నాయకులు జి వెంకటేశ్వర్‌ రెడ్డి, వెంకటానాయక్‌ , జంగయ్య యాదవ్‌ , భాస్కర్‌ నాయిక్‌ , బాబు నాయిక్‌, అరుణ్‌ రెడ్డి నూతన 37 విలేజెస్‌ ప్రెసిడెంట్స్‌ మండల నాయకులు పాల్గొన్నారు.