నవతెలంగాణ డిచ్ పల్లి.
స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్ పల్లి వారి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నమని సంస్థ డైరెక్టర్ ఎస్ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎలక్ట్రీషియన్ 30 రోజులు 14 నవంబర్ నుండి, సీసీటీవీ రిపేరింగ్ 13 రోజులు 15 నవంబర్ నుండి, సెల్ ఫోన్ రిపేర్ 30 రోజులు ,కంప్యూటర్ అకౌంటింగ్ 30 రోజులు ఉచిత శిక్షణ తో పాటుగా ఉచిత భోజన సదుపాయం, హాస్టల్ వసతి కల్పించాడం జరుగుతుందని అయన వివరించారు. శిక్షణా అనంతరం ధ్రువీకరణ పత్రం ను అందించబడుతుందని పేర్కొన్నారు.శిక్షణకు కావాల్సిన అర్హతలు19 నుండి 40 ఏళ్ల వయస్సు కలిగి ఉండి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత యువకులు అర్హులని ,ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని సంస్థ డైరెక్టర్ ఎస్ శ్రీనివాస్ తెలిపారు.శిక్షనకు వచ్చే వారు తమ వెంట ఆధార్ కార్డ్ జిరక్స్ ,రేషన్ కార్డ్, 10 వ తరగతి ధ్రువీకరణ పత్రం, ఐదు ఫోటోలు తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకోగలని సూచించారు.ఏదైనా సమాచారం కోసం ఎస్‌బీఐ శిక్షణా కేంద్రం వెలుగు ఆఫీసు ప్రక్కన ఘన్పూర్ రోడ్ డిచ్ పల్లి లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకునమోదు చేసుకోగలన్నారు. వివరాలకు 08461 295428 ఫోన్ నంబర్ లలో సంప్రదించ వచ్చని పేర్కొన్నారు.