తానా మహాసభలకు రౌనక్‌ యార్‌ ఖాన్‌కు ఆహ్వానం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అమెరికాలోని తానా మహాసభలు నిజాంల అసఫ్‌ జాహీ రాజవంశానికి చెందిన తొమ్మిదవ అధిపతి రౌనక్‌ యార్‌ ఖాన్‌కు ఆహ్వానం అందింది.
ఉత్తర అమెరికాలోని పురాతన, అతిపెద్ద ఇండో-అమెరికన్‌ సంస్థ తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా), అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జులై 7న ప్రారంభం కానున్న 23వ తానా సమావేశాలకు హాజరు కావాల్సిందిగా కోరింది. రవి పొట్లూరి నేతృత్వంలోని తానా ప్రతినిధి బృందం హైనెస్‌ రౌనఖ్‌ యార్‌ ఖాన్‌ను వ్యక్తిగతంగా కలుసుకుని దానికి హాజరు కావాలని ఆహ్వానించారు.