రైల్వే ట్రాక్‌ దొంగలపై ఉక్కు పాదం మోపాలి

అఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌
నవతెలంగాణ – భువనగిరి
రైల్వే ట్రాక్‌ దొంగలపై ఉక్కు పాదం మోపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ చేరికలు సంఘం చైర్మెన్‌ హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. గురువారం రైలు ప్రమాదంలో మతి చెందిన హుజరాబాద్‌ నియోజకవర్గంకు చెందిన ముప్పు శ్రీకాంత్‌ మతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో ఆయన సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైల్వే ట్రాక్‌ పై కొందరు దుండగులు రైల్లో ప్రయాణిస్తున్న శ్రీకాంత్‌ చేతిలో ఉన్న సెల్‌ ఫోన్లు లాక్కోవడం వలన ఈ ప్రమాదం జరిగిందన్నారు. కమలాపూర్‌ మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ తల్లిదండ్రులు కష్టపడి చదివించాగా ఇన్ఫోసిస్‌ లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని అండగా ఉంటూ పోషించేవాడన్నారు. సెలవు దినం కావడంతో గ్రామానికి వచ్చే క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా రైల్వే ట్రాక్‌లపై దొంగలపై ఉక్కు పాదం మోపేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దష్టికి తీసుకోవెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌ మోర్చారాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్‌ రెడ్డి, ఆలేరు మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌్‌, ఆలూరు నియోజకవర్గ నాయకుడు పడాల శ్రీనివాస్‌, భువనగిరి మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మాయ దశరథ, కౌన్సిలర్‌ బలరాం, నాయకులు రాస వెంకట్‌, జనగాం నరసింహ చారి, శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.