నవతెలంగాణ- రెంజల్
నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆయకట్టు చివరి వరకు వెళ్లాల్సిన సాగునీటి కాలువ మురికి కాలువగా మారింది. సాఠాపూర్ చౌరస్తా లో ప్రధానంగా హోటల్ సముదాయాల వెనుక భాగంలో నున్న ఈ కాలువ లోకి మురికి రావడంతో దుర్గంధం గా తయారయింది. ఈ ప్రధాన కాలువను శుభ్రం చేసినట్లయితే చివరి ఆయకట్టు రైతులకు సుమారుగా 400 ఎకరాలకు సాగునీటి అందించే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. పలుమార్లు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవడంలేదని వారు వా పోతున్నారు. ఈ కాలువలో చెత్తాచెదారిని వేయకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతాంగం కోరుతుంది.