ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

నవతెలంగాణ-భిక్కనూర్
యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్ భిక్నూర్‌ పట్టణ కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మోహన్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి గౌడ్, నర్సాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.