విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దవలసింది ఉపాధ్యాయులే 

– సిఎస్ఐ చర్చిలో ఉపాధ్యాయ దినోత్సవం

నవతెలంగాణ-జక్రాన్ పల్లి : విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ద వలసింది ఉపాధ్యాయిలెనని పాస్టర్ శశి ప్రకాష్ ఆదివారం అన్నారు.  మండల కేంద్రంలోని జక్రాన్ పల్లి పాస్టరేట్లో  ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరినీ   గౌరవిస్తూ ఘనంగా పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆరాధనలో భాగంగా టీచర్ల బాధ్యత గురించి వివరంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఐ చర్చి సంఘ సభ్యులు మహిళలు యువతులు యువకులు వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.