నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
పెద్ద కొడపగల్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధువరం నాడు ఎంపీపీ ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులను నిలదీశారు.సముందర్ తండాలో గత 15 రోజుల నుండి మిషన్ భగీరత తాగునీరు రావడం లేదని భగీరథ అధికారిని డీ. ఈ కౌశిక్ ను నిలదీశారు. తాండలో ప్రజలకు తాగు నీటి సరఫరా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వీడి తాగునీటి సరఫరా చేసి ప్రజలకు అదుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట ప్రజలు తాగునీటి సమస్యల నుండి దూరం చెయ్యాలనే ఉద్దేశ్యంతో మీషన్ భగీరత పథకం ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు అందించి కష్టాలను దూరం చేయాలనే ఆలోచనతో పథకం ప్రారంభిస్తే అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాగడానికి నీళ్లు అందిస్తాలేరాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవసాయ శాఖ అధికారిపై ఆగ్రహం
మండలంలోవ్యవసాయ శాఖ అధికారలు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించకపోవడంతో పత్తి రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి నదీమ్ ఉద్దిన్ ను ప్రశ్నించారు.అధికారులు మండలంలో రైతుల వద్ద వెళ్ళి పంటలపై అవగాన చేయడం చేయడం లేదని సబ దృష్టికి తీసుకెళ్లారు.దింతో ఎంపీపీ కలగజేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి పంటను పరిశీలించి రైతులకు సూచనలు సలహాలు చెయ్యేలాని ఆదేశించారు. అయితే అక్కడే ఉన్న కాసులాబాద్ సర్పంచ్ కలగజేసుకొని వ్యవసాయ శాఖ అధికారి గ్రామంలోకి వచ్చిన రైతులకు ఎలాంటి లాభం లేదని వాపోయారు. అధికారి గ్రామంలోకి వచ్చిన ఎరువుల దుకాణంలోనే ఉంటాడని ఇక రైతులకు ఎలా సమయం ఇస్తాడని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంగా కారణంగా పంటలు మొత్తం దెబ్బతిందని అన్నారు.
వైద్య శాఖ పై పిర్యాదు
మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులను డాక్టర్ లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం చేయడం కారణంగా ప్రభుత్వ దవాఖానకు వెళ్లనంటేనే రోగులు జంకుతున్నారని కో అప్సన్ మెంబర్ జాఫర్ షా తెలిపారు.డ్యూటీలో ఉన్న నర్శులు రోగులకు ఒంటి చేత్తో సుదీలు నిర్లక్ష్యంగా ఇస్తున్నారని దింతో గడ్డలు కడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అంతే కాకుండా రోగులకు అవసరమైన వైద్య సేవలు గోలీలు గ్లూకోజ్ ఇవ్వకపోవడంతో రోగులు దిక్కుతోచని స్థితిలో ప్రయివేట్ దవాఖానలో వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారని దింతో వేలకు వేలకు డబ్బులు ఖర్చులు అవుతుందని అన్నారు. ఇప్పటి కైనా అధికారులు దావాఖన డాక్టర్ లు పేద ప్రజల కోసం పని చెయ్యాలని కోరారు.ఎంపీపీ ప్రతాప రెడ్డి మాట్లాడుతూ మండలంలో పని చేస్తున్న పలు శాఖల అధికారులు ప్రజల కోసం పని చెయ్యేలాని ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప రెడ్డి, ఎంపీడీఓ రాణి, తహసీల్దార్ దశరథ్, బిచుకుందా మార్కెట్ కమిటి చైర్మన్ నాగనాథ్ పటేల్, వైస్ చైర్మన్ ఖండేరావు పటేల్, మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు తిర్మల్ రెడ్డి ఎంపిటిసిలు, సర్పంచ్ లు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.