గిరిజనులకు సేవ చేయడమే ఐటీడీఏ లక్ష్యం

ఐటీడీఏ పీవో అంకిత్‌
నవతెలంగాణ- ఏటూరునాగారం ఐటిడిఏ
గిరిజనుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని, వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ఐటీడీఏ కృషి చేస్తోందని ఐటీడీఏ పీఓ అంకిత్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను పీఓ అంకిత్‌ ఎగురవేశారు. అనంతరం సమావేశపు గదిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 మేడారం జాతర సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు తేదీలను ప్రకటించారన్నారు. 21 శాఖలతో రూ. 15.60 కోట్ల శాశ్వత నిర్మాణలకు, రూ. 55.60 కోట్లతో మరమ్మతులు చేయించడం జరుగుతుందన్నారు. అలాగే విద్యాశాఖ ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గిరిజన విద్యార్థులకు మౌళిక వసతులు కల్పించామన్నారు. 2023%–24లో 366 మంది గిరిజనులకు బెస్ట్‌ అవలెబుల్‌ స్కీం కింద ప్క్రెవేటు పాఠశాలల్లో చదివించేందుకు నిదులు ఐటీడీఏ ఖర్చు చేస్తోందన్నారు. వైద్య ఆరోగ్య జిల్లాలోని ఆస్పత్రుల్లో 8 టీంలు ఏర్పాటు చేసి గిరిజన గ్రామాల్లో సేవలు అందిస్తున్నట్లు పీఓ తెలిపారు. ఉచితంగా అంబులెన్సు, 174 గ్రామాల్లో 79 రోజుల పాటు 20 బందాలు 1.64 లక్షల మదికి కంటి పరీక్షలు చేయించామన్నారు. గర్బిణీలు,బాలింతలకు న్యూట్రేషన్‌ ఫుడ్‌ కిట్స్‌ అందించామన్నారు. ఇంజనీరింగ్‌ ద్వారా బీటీ రోడ్లు, మరుగుదొడ్లు, ఇతర నిర్మాణం పనులు రూ. 316 కోట్ల పనులు చేయించామన్నారు. 117 అంగన్‌వాడీ కేంద్రాల నీతి అయోగ్‌ ద్వారా నిధులు కేటాయించామన్నారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద 44 సబ్‌ సెంటర్లకు భవనాలు, ఇతర సదుపాయాలు కల్పించామన్నారు. ట్క్రెకార్‌ ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు 6761 యూనిట్లు ఈఎస్‌ఎస్‌ కింద మంజూరు కాగా రూ. 5.5 కోట్లతో నిధులు మంజూరు ఇచ్చి యూనిట్లు అప్పగిస్తున్నామన్నారు. శిక్షణ కింద 1343 మంది నిరుద్యోగ యువతకు పలు రకాల శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించామ న్నారు. గిరిజన మత్స్యశాఖ పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చామన్నారు. ప్రభుత్వం ఉచితంగా 1.62 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. ట్క్రెనింగ్స్‌ పీఈటీసీ ద్వారా 90 రోజుల పాటు ఆయా అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ ఇచ్చామన్నారు. 500మంది రైతులతో 500 ఎకరాలలో ప్రకతి వ్యవసాయం చేయించామన్నారు. వరంగల్‌ నాచురల్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌, వన సమాక్య, ఈకో ఫౌండేషన్‌ ఫర్‌ రీసెర్చ్‌ ద్వారా 165 ఎకరాలలో ఉచితంగా రైతులకు శిక్షణ ఇస్తున్నామనాన్రు. గిరి వికాసం కింద 3018మంది రైతులకు రూ. 8.54 కోట్లతో బోర్‌ వెల్‌ వేయించా మన్నారు. గిరిజన సహాయ నిధి కింద 139 మందికి రూ. 33.63 కోట్ల నిధులు ఆపదలో ఉన్న గిరిజన కుటుంబాలకు అందించామన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 17006 మందికి రైతులకు ఎకరానికి రూ. 5వేల చొప్పున లబ్ధి చేకూర్చుతుందన్నారు. పోడు భూము భూములకు 53 వేల 450 మందికి గాను 1.73 లక్షల ఎకరాలకు సర్వే చేశామని, దరఖాస్తులను పరిశీలించామన్నారు. జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల రూ. 85.72 లక్షల విలువ చేసే అటవీ ఉత్పత్తులను జీసీసీ ద్వారా సేకరించి గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూర్చామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ రూ. 56.34 కోట్ల ఉత్పత్తులను సేకరించామన్నారు. పెట్రోల్‌ బంక్‌లు 14 ఏర్పాటు చేసి గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. గిరిజ నుల అభివృద్ది కోసం కృషి చేస్తున్నామన్నారు. ఏపీఓ వసంతరావు, డీడీ పోచం, ఏఓ దామోదరస్వామి, ఎస్‌ఓ రాజ్‌కుమార్‌, జీసీసీ డీఎం ప్రతాప్‌రెడ్డి, పీహెచ్‌ఓలు రమణ, భారతి, ఏఏఓ సంతోష్‌, మేనేజర్‌ శ్రీనివాస్‌, డీఎస్‌ ఓ లాల్‌, ఏసీఎంఓ రవీందర్‌, ఏఏసీఎంఓ వాగ్య, జీసీడీఓ సుగుణ పాల్గొన్నారు