చికిత్సకు సహయమందజేయడం హర్షణీయం.. 

– ఎమ్మెల్యే కవ్వంపల్లికి ఉప సర్పంచ్ సుధీర్ రెడ్డి కృతజ్ఞతలు

నవతెలంగాణ-బెజ్జంకి 
అభ్యర్థించిన వెంటనే వైద్య చికిత్స కోసం మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సహయం అందజేయడం హర్షణీయమని శుక్రవారం ఉప సర్పంచ్ సుధీర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.మండల పరిధిలోని ముత్తన్నపేట గ్రామానికి చెందిన రేవోజు స్వరూప వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల ఎల్ఓసీ అందజేయడంతో ఎమ్మెల్యే కవ్వంపల్లికి సుధీర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.