
నవతెలంగాణ-జక్రాన్ పల్లి : జక్రంపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని అనంతరం వివిధ దుర్గమ్మ మండపాలను దర్శించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిజామాబాద్ రూరల్ ఇంచార్జ్ దినేష్ కులాచారి ఈ కార్యక్రమంలో జక్రాంపల్లి మండల కేంద్రానికి చెందిన జక్కం కార్తీక్ కు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు కిషన్ నాయక్ నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పద్మా రెడ్డి. జిల్లా కార్యవర్గ సభ్యులు కొప్పు రాజేందర్. సీనియర్ నాయకులు అల్లెం అశోక్ బీజేవైఎం మండల అధ్యక్షులు బొజ్జ సంజవ్ గౌడ్. బూత్ అధ్యక్షులు జగడం సత్యనారాయణ. ఉట్నూర్ సురేష్. మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.