
మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన జక్కి ప్రభాకర్ 54 తన నివాస గృహంలో ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందడం జరిగిందనీ పసర ఎస్సై ఏ కమలాకర్ తెలిపారు. ఎస్సై కమలాకర్ కథనం ప్రకారం ప్రభాకర్ ఈనెల 20న సమీపంలో ఉన్న తన అక్క ఇంటి వద్ద భోజనం చేసి రావడం జరిగిందని అప్పటినుండి కనిపించకపోవడంతో శనివారం ప్రభాకర్ కొరకు వచ్చిన అతని స్నేహితుడు కిటికీ నుండి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు కనిపించినట్లు తెలిపారు. మృతుని అన్న జయరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ములుగు తరలించడం జరిగిందని అన్నారు. కాగా గ్రామంలో ప్రభాకర్ మృతిపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభాకర్ ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని, ఏదో జరిగి ఉంటుందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ అందితేనే వాస్తవం తెలుస్తుందని పలువు అభిప్రాయపడుతున్నారు.