– టిఎస్ఆర్.టి సి చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు ఘన స్వాగతం పలికిన జక్రాన్ పల్లి .మండల ప్రజా ప్రతినిధులు .
నవతెలంగాణ-జక్రాన్ పల్లి
టి.ఎస్ .ఆర్ .టి. సి చైర్మన్ మరియు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు జక్రాన్ పల్లి .మండల ప్రజా ప్రతినిధులు, జక్రాన్ పల్లి మండల జెడ్ పి టి సి తనుజ శ్రీనివాస్ రెడ్డి మండల ఎంపీపీ కుంచాలా విమల రాజు ,ఘన స్వాగతం పలికారు. ముచ్చటగా మూడవసారి తెలంగాణ శాసనసభ నిజామబాద్ రూరల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిఎమ్మెల్యేగా బాజిరెడ్డిగోవర్ధన్, కేసీఆర్ ప్రకటించాగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామబాద్ రూరల్ కు వస్తుండడంతో వారికి ఘన స్వాగతం పలకడానికి మండలంలోని ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ఆనందోత్సాలతో ఇందలవాయి టోల్ ప్లాజా ఎన్ హెచ్ 44 వద్దకు చేరుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జక్రాన్ పల్లి మండల జెడ్ పి టి సి తనుజ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్.కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే బాజిరెడ్డి గోవర్ధన్ తిరిగి అధిక సంఖ్య మెజారిటీతో గెలిపించి హ్యాట్రిక్ సాధిస్తామని జక్రాన్ పల్లి మండల జెడ్ పి టి సి తనుజ శ్రీనివాస్ రెడ్డి మరియు ప్రజా ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కుంచాలా విమల రాజు,బీ.ఆర్.యస్. పార్టీ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న మరియు రైతుబంధు మండల్ అధ్యక్షుడు డికొండ శ్రీనివాస్, మండల్ కు చెందిన సర్పంచ్ లు, ఎంపీటీసీలు సొసైటీ చైర్మన్లు, మండల కో ఆప్షన్ నెంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్ , మాజీ ఎంపీపీలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.