నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి అధ్వర్యంలో గ్రామ దేవతలకు జలాభిషేకం శుక్రవారం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని గ్రామ దేవతలకు గంగా జలంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అశోక్ కుమార్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు ప్రసాద్ గౌడ్, సభ్యులు, గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.