నవతెలంగాణ- రామారెడ్డి: తెలంగాణ శాసనసభ ఎన్నికల నుండి వైయస్సార్ టి పి తప్పుకొని, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ఎల్లారెడ్డి నియోజకవర్గ వైయస్సార్ టి పి ఇంచార్జ్ జమున రాథోడ్ బీఎస్పీ పార్టీలోకి వెళ్ళనున్నట్లు సమాచారం. ఆ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బి ఎస్ పి లో చేరి, పోటీ చేస్తే, బడుగు బలహీన వర్గాల ఓట్లు చీలే అవకాశం ఉన్నందున, ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారనుంది. దాదాపు గత పది సంవత్సరాల కాంగ్రెస్, వైయస్సార్ పార్టీలలో పనిచేసిన అనుభవం, కార్యకర్తలతో రాజకీయ సంబంధాలు, భర్త వెంకట్ వైద్యులుగా సేవలందించడం వంటి కార్యక్రమాలతోపాటు షెడ్యూల్ తెగలకు చెందిన వారు కావడంతో, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో షెడ్యూల్ తెగలకు చెందిన ఓటు బ్యాంకు అధికంగా ఉండటం వారికి కలిసొచ్చే అవకాశం ఉంది.