నవతెలంగాణ – రేవల్లి: మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అన్ని సంఘాల అధ్యక్షులు, గ్రామాల యూత్ అధ్యక్షులు, మహిళ గ్రామ అధ్యక్షులు, ఎంపిటిసి లు, మండల సోషల్ మీడియా కన్వీనర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అక్టోబర్ 2 న గాంధీ జయంతిని మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పునస్కరించుకొని రేవల్లి మండల కేంద్రంలో ఉదయం 9 గంటలకు అంబేద్కర్ విగ్రహం నుండి గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేసి గాంధీ గారికి పూలమాల అలంకరించారు. సత్యమేవ జయతే పాదయాత్ర నిర్వహించారు. అన్ని గ్రామాల స్థాయి నాయకులతో పాటు అధ్యక్షులు కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొన్నారు. “సత్యమే ఎప్పటికీ గెలుస్తుంది, నిలుస్తుంది” అని ఆచరణలో నిరూపించిన గాంధీజీ సిద్ధాంతానికి ఎల్లవేళలా అనుసరిస్తూ ఆశయాలకు కట్టుబడి ఉంటామని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు మండల కాంగ్రేసు పార్టీ అధ్యక్షులు వాడల పర్వతాలు, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు ఎం పర్వతాలు, ఎంపీటీసీ రాములు, కిసన్ సెల్ అధ్యక్షుడు చిన్న రెడ్డి, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.