నవతెలంగాణ- నవీపేట్: జవహర్ నవోదయలో లిటిల్ ఫ్లవర్ విద్యార్థిని మనస్విని 9వ తరగతిలో ఎంపిక అయిందని తను ట్యుటోరియల్ డైరెక్టర్ సంతోష్ కుమార్ బుధవారం తెలిపారు. తను ట్యుటోరియల్ లో 9వ తరగతిలో ఇద్దరు విద్యార్థులకు గాను మొదటి కౌన్సిలింగ్ లో సహస్ర సీటు సంపాదించగా, రెండో కౌన్సిలింగ్ లో మనస్విని సీటు సంపాదించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జవహర్ నవోదయ 9వ తరగతిలో 100% ఫలితాలు సాధించడం పట్ల పలువురు డైరెక్టర్ సంతోష్ కుమార్ ను ప్రశంసించారు.