ఉద్యోగ ఉపాధ్యాయులకు హామీలు కాదు ఆచరణలో చేసి చూపించాలి

నవతెలంగాణ- శంకరపట్నం
యూఎస్ పిసి ఉపాధ్యాయ కూటమి ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల మహా ప్రదర్శన-ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ పక్షాన ఎంఏ ఖాద్రీ హాజరై మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రయోజనాలు పట్ల హామీలు కాదు కావాల్సింది ఆచరణలో చూపించాలని, ఆయన అన్నారు. పీఆర్సీ వేసి ఐఆర్ 40%ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులు ఆచరణలో చూపితేనే నమ్మేటట్లు ఉన్నారని ఆయన తెలిపారు.