బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి..బీఆర్‌ఎస్‌లో చేరిక

ధరూర్‌ / మల్దకల్‌: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధరూర్‌ మండలంలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు ,వాల్మీకి బోయ సంఘం నాయకులు జల్ల చిన్నప్ప ,జేయ్యప్ప ,మహదేవ్‌ కొండన్న బోయ ఆంజనేయులు జయన్న నాగరాజు రామాంజి గోవిందు నరేష్‌లతో పాటు దాదాపు 20 మంది పైగా బీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే మల్దకల్‌ మండలంలోని అమరవాయి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ, నాయకులు జగదీశ్వర్‌ రెడ్డి గోపాల్‌ రెడ్డి రాజారెడ్డి రామకష్ణారెడ్డి జయన్న రామకష్ణ ఆనందు జయరాములు, దాస్‌లతో పాటు మరికొందరూ చేరారు. వీరికీ ఎమ్మెల్యే బండ్ల కష్ణమోహన్‌ రెడ్డి గులాబీ కండువా కప్పీ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మండల కేంద్రానికి చెందిన సింగిల్‌ విండో డైరెక్టర్‌ మరియమ్మ, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు జె. శ్రీనివాస్‌ రెడ్డి ,రామన్న ఆధ్వర్యంలో 50మంది అనుచరులతో కలిసి బండ్ల క్రిష్ణ మోహన్‌ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర సీనియర్‌ నాయకులు నాగర్‌ దొడ్డి వెంకట్రాములు, బీఆర్‌ఎస్‌ నాయకులు రమేష్‌ నాయుడు, వేణు గోపాల్‌ రావు, హనుమంతురావు , కుర్వ శ్రీనివాసులు, జంగం రాజు, నర్సింహులు, సవారన్న, రాజు, , దాసు, నాగరాజు, ఈశ్వర్‌, డేవిడ్‌, ఆదమ్‌,ఎంపీపీ రాజారెడ్డి, ఎంపీటీసీ గోపాల్‌ రెడ్డి, మండల అధ్య క్షుడు, బీఆర్‌ఎస్‌ నాయకులు రమేష్‌ నాయుడు, పటేల్‌ ప్రభాకర్‌ రెడ్డి , వెంకటేశ్వర్‌ రెడ్డి, తూం కష్ణ రెడ్డి రాధాకష్ణ రెడ్డి,రత్నం,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.